జ్యోతిలక్ష్మిని పుర్తిచేసేసిన పూరి

జ్యోతిలక్ష్మిని పుర్తిచేసేసిన పూరి

Published on Apr 29, 2015 11:30 PM IST

Jyothilakshmi
ఒక సినిమాను మొదలుపెట్టడానికి ఎంతో సమయం తీసుకుని గ్రౌండ్ వర్క్ లు, ప్రీ ప్రొడక్షన్ లు అంటూ సాగదీస్తున్న ఈరోజుల్లో తన సినిమాకి కొబ్బ‌రికాయ కొట్టిన‌రోజునే విడుద‌ల తేదీని ప్ర‌క‌టించే ఏకైక టాలీవుడ్ ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌.

ఈ కారణానే పూరి సినిమాలు ఎప్పుడూ కాస్ట్ ఫెయిల్యూర్స్ ఉండ‌వని చెబుతుంటారు టాలీవుడ్ నిర్మాత‌లు. తాజా సమాచారం ప్రకారం టెంపర్ విజయం అందించిన ఊపులో ఛార్మీతో మొదలుపెట్టిన `జ్యోతిల‌క్ష్మి` సినిమా చిత్రీక‌ర‌ణ‌ని పూర్తి చేశాడట. ఛార్మి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ కేవ‌లం 37 రోజుల్లోనే పూర్త‌వడం విశేషం. అనుకొన్న‌ట్టుగానే మే లోనే చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాను పూరి, ఛార్మి, సి.క‌ళ్యాణ్ ముగ్గురూ క‌లిసి నిర్మిస్తున్నారు

తాజా వార్తలు