పూరి పెట్టిన ఈ ఇంట్రస్టింగ్ టైటిల్ ఎవరి కోసం ?

పూరి పెట్టిన ఈ ఇంట్రస్టింగ్ టైటిల్ ఎవరి కోసం ?

Published on Sep 3, 2018 2:18 PM IST

puri
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ పూరిని హీరోగా పరిచయం చేస్తూ.. మెహబూబా చిత్రం తీశారు. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ, పూరి తన కుమారుడితో మరో చిత్రాన్ని తీయబోతున్నారని గతంలో సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు పూరి తన కొత్త ప్రాజెక్టును ఇంకా ప్రకటించలేదు. అయితే తాజాగా పూరి జగన్నాధ్ నిర్మాణంలో ఆకాష్ పూరి హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతుంది.

తన దగ్గర సహాయకుడిగా పని చేసిన ఓ యంగ్ డైరెక్టర్ కి పూరి దర్శకత్వం ఛాన్స్ ఇస్తున్నారట. అతని దర్శకత్వంలోనే ఆకాష్ తన రెండో సినిమాని చేయబోతున్నాడు. కాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. పూరి జగన్నాధ్ టూరింగ్ టాకిస్ బ్యానర్ పై ‘వాస్కో డ గామా’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. ఈ టైటిల్ ఆకాష్ కోసమా లేక పూరి డైరెక్ట్ చేయబోయే సినిమా కోసమా అన్నది తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు