పూరి కొత్త స్క్రిప్ట్ మెగా హీరోల కోసం కాదట..!

Published on Apr 4, 2020 11:00 pm IST

టాలీవుడ్ లో వేగంగా సినిమాలు తీసే దర్శకుడు ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు పూరి జగన్నాధ్. ఈయనతో పాటు ఇండస్ట్రీలో ఉన్న ఏ దర్శకులు పూరి చేసిన సినిమాలలో సగం కూడా చేయలేదు. 15 రోజుల్లో బ్యాంకాంక్ బీచ్ లలో కుర్చొని స్క్రిప్ట్ పూర్తి చేసే పూరి, మరో మూడు నెలల్లో సినిమా చుట్టేస్తాడు. అది ఆయన ప్రత్యేకత. కాగా విజయ్ దేవరకొండ తో ఆయన చేస్తున్న మూవీ షూటింగ్ కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదాపడింది. దీనితో ఇంట్లో ఖాళీగా ఉంటున్న పూరి కొత్త మూవీ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట.

కాగా పూరి మెగా హీరో చిరు కోసం ఈ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఆ తదుపరి కాదు ఆయన చరణ్ కోసం స్క్రిప్ట్ రాస్తున్నారంటూ మరో పుకారు నడిచింది. ఐతే పూరి అసలు టాలీవుడ్ లో ఎవరినీ టార్గెట్ చేసుకొని రాయడం లేదట. ఆయన ఫోకస్ బాలీవుడ్ యంగ్ హీరోలపై పడిందని సమాచారం. పూరి బాలీవుడ్ హీరోలను మైండ్ లో పెట్టుకొని అక్కడి నేటివిటీకి సరిపోయేలా ఓ మోడరన్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట. విజయ్ దేవరకొండ సినిమాలో నిర్మాణ భాగస్వామిగా కరణ్ జోహార్ ఉన్న నేపథ్యంలో స్క్రిప్ట్ నచ్చితే ఆయన్ని నిర్మాతగా ఈజీగా ఒప్పించవచ్చు. కాబట్టి పూరి బాలీవుడ్ ని దృష్టిలో పెట్టుకొని కొత్త స్క్రిప్ట్ రాస్తున్నారని వినికిడి.

సంబంధిత సమాచారం :

X
More