‘లోఫర్’ అన్న టైటిల్‌ సరైనదే : పూరీ

‘లోఫర్’ అన్న టైటిల్‌ సరైనదే : పూరీ

Published on Dec 14, 2015 7:28 PM IST

puri
మెగా ఫ్యామిలీ నుంచి ఈమధ్యే ఎంట్రీ ఇచ్చిన హీరో వరుణ్ తేజ్, తాజాగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో ‘లోఫర్’ పేరుతో ఓ మాస్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. మదర్ సెంటిమెంట్‌ను హైలైట్ చేసుకొని తెరకెక్కిన ఈ సినిమాను మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్‌, ఆడియోతో క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఇక సినిమా రిలీజ్‌కు దగ్గరపడడంతో యూనిట్ అంతా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది.

ఇక ప్రమోషన్స్‌లో భాగంగా పూరీ జగన్నాథ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. చాలాకాలం తర్వాత మదర్ సెంటిమెంట్‌ను హైలైట్ చేస్తూ ఈ సినిమా చేశానని, అందరికీ నచ్చే విధంగా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఉంటుందని తెలిపారు. ఇక ‘లోఫర్’ అన్న టైటిల్‌కూ, సినిమా కథకూ సంబంధం లేనట్టు కనిపిస్తుందే అన్న ప్రశ్నకు సమాధానంగా.. “నేనూ ఈ సినిమా టైటిల్‌ను ముందు అనుకున్నట్లు ‘మా అమ్మ సీతామాలక్ష్మి’ అని మారుద్దామనే అనుకున్నా. అయితే లోఫర్ అన్న టైటిల్ అప్పటికే జనాల్లోకి వెళ్ళిపోవడంతో ఇక మార్చలేదు. ఈ సినిమాకు లోఫర్ అన్న టైటిల్ కూడా హీరో పాత్ర దృష్టిలో చూసినప్పుడు కరెక్టే. సో, టైటిల్‌తో ఏ ఇబ్బందీ లేదు. ఇది మదర్ సెంటిమెంట్ సినిమా అని కూడా తెలిసిపోయింది కాబట్టి ఆ రకంగానూ ఏ ఇబ్బందీ లేదు” అని తెలిపారు. సి.కళ్యాణ్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన దిశా పాట్ని హీరోయిన్‌గా నటించారు.

తాజా వార్తలు