డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ ఇప్పటి వరకూ ‘గబ్బర్ సింగ్’, ‘బుజ్జిగాడు’, ‘ధోని’ మొదలైన సినిమాలలో బాల నటుడిగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పటికీ అడపాదడపా తన వయసుకు దగ్గ సినిమాలు చేస్తూనే వస్తున్న ఆకాష్ ఇక నుంచి వాటికి బ్రేక్ ఇచ్చి సోలో హీరోగా అరంగేట్రం చేయనున్నాడు.
అసలు విషయంలోకి వెళితే ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి అన్నీ సిద్దమయ్యాయి. అది కూడా మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘టైం పాస్’ అనే మూవీకి రీమేక్ గా రానున్న సినిమా ద్వారా ఆకాష్ హీరోగా పరిచయం కానున్నాడు. తెలుగులో ‘ఋషి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాజ్ మాదిరాజు డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాని ప్రసాద్ ప్రొడక్షన్స్ పై రమేష్ ప్రసాద్ నిర్మించనున్నారు. ఈ సినిమాకి చెందిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియజేసే అవకాశం ఉంది.
