నాన్న కలను నెరవేర్చేందుకే ఇండస్ట్రీకి వచ్చా – ‘పురుష:’ హీరో పవన్ కళ్యాణ్

నాన్న కలను నెరవేర్చేందుకే ఇండస్ట్రీకి వచ్చా – ‘పురుష:’ హీరో పవన్ కళ్యాణ్

Published on May 17, 2026 8:00 AM IST

కుటుంబ సమేతంగా చూసి ఆస్వాదించేలా ‘పురుష:’ చిత్రం ఉంటుందని హీరో పవన్ కళ్యాణ్ తెలిపారు. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు వీరు వులవల దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మే 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో పవన్ కళ్యాణ్ మీడియాతో ముచ్చటించారు.

​పల్నాడులోని కారంపూడికి చెందిన తమ కుటుంబానికి సినీ నేపథ్యం లేదని, తన తండ్రి కోరిక మేరకే హీరోగా మారానని పవన్ చెప్పారు. విశాఖలో సత్యానంద్ వద్ద తాను నటనలో శిక్షణ తీసుకున్నట్లు వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టేందుకు తన సోదరి సరస్వతి ఇచ్చిన మద్దతు మరువలేనిదన్నారు.

​మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని పంచాలనే ఉద్దేశంతో, డీఓపీ సతీష్ సూచనతో ఈ కథను ఎంచుకున్నట్లు పవన్ తెలిపారు. దర్శకుడు వీరు వులవల తనను ఎంతగానో ప్రోత్సహించారని, అలాగే సప్తగిరి, కసిరెడ్డి లాంటి సీనియర్ నటులు షూటింగ్ సమయంలో తనకు అండగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ సినిమా తరహాలో ఈ మూవీ అన్ని వర్గాల వారిని అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సినిమా రిలీజ్ తర్వాతే తన తదుపరి ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు