మే 22న థియేటర్లలోకి ‘పురుష:’.. గ్రాండ్ రిలీజ్!

మే 22న థియేటర్లలోకి ‘పురుష:’.. గ్రాండ్ రిలీజ్!

Published on May 7, 2026 8:00 AM IST

వేసవి కానుకగా కుటుంబ సమేతంగా నవ్వుకునేలా తెరకెక్కిన ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్ ‘పురుష:’. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం అవుతుండగా, వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ సినిమాను మే 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

​ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, గ్లింప్స్ మరియు టీజర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించాయి. ఇందులో సప్తగిరి, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, వి.టి.వి. గణేష్ వంటి అనుభవజ్ఞులైన నటులు కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం. పూర్తి హాస్యభరితంగా సాగే ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

​త్వరలోనే ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తుండగా, సతీష్ ముత్యాల సినిమాటోగ్రాఫర్‌గా, కోటి ఎడిటర్‌గా, రవిబాబు దొండపాటి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు