రెండు రోజుల్లోనే “పుష్ప” 100 కోట్లకు పై బాక్సాఫీస్ బ్లాస్ట్..!

Published on Dec 19, 2021 1:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తన మరో హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ కాంబోలో చేసిన లేటెస్ట్ భారీ సినిమా “పుష్ప ది రైజ్”. భారీ అంచనాలు నడుమ మొత్తం పాన్ ఇండియన్ వైడ్ అనుకున్న సమయానికే రిలీజ్ అయ్యిన ఈ చిత్రం మొత్తం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతూ దూసుకెళ్తుంది.

మరి నిన్న మొదటి రోజుకే పుష్ప ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్లకి పైగా గ్రాస్ ని వసూలు చెయ్యగా ఇక రెండో రోజుకే ఏకంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసినట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటన చేశారు. ఈ రెండు రోజులకి గాను పుష్ప సినిమా 116 కోట్ల భారీ వసూళ్లను అందుకున్నట్టుగా తెలిపారు. దీని బట్టి బాక్సాఫీస్ దగ్గర పుష్ప బ్లాస్ట్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :