ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 ది రూల్ కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సాలిడ్ సీక్వెల్ ఇపుడు ఫైనల్ గా ఓటిటిలో కూడా వచ్చేసింది. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ కి ఇపుడు ఓ రేంజ్ రీచ్ దక్కింది అని చెప్పాలి.
అల్లు అర్జున్ పై సాగే రప్పా రప్పా మాస్ యాక్షన్ సీన్ చూసి వెస్ట్రన్ దేశాల ఆడియెన్స్ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ఇంకొందరు అయితే మార్వెల్ హీరోలకి మించి బన్నీ పెర్ఫామెన్స్ యాక్షన్ లో బాగుంది అని కూడా అంటున్నారు. దీనితో ఇపుడు పుష్ప గాడి రూల్ నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో అదరగొడుతుంది అని చెప్పాలి. మరి ముందు రోజుల్లో RRR రీతిలోనే మరింత దూసుకెళ్తుందా లేదా అంది చూడాలి మరి.