రజినీ రికార్డ్ బ్రేక్ చేసి ఇండియన్ వైడ్ టాప్ 2 లో “పుష్ప”.!

Published on Jun 11, 2021 10:00 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ అండ్ భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ సాలిడ్ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. అయితే సుకుమార్ స్ట్రాంగ్ వర్క్ మళ్ళీ ఎలా ఏ స్థాయిలో ఉండనుందో మేకర్స్ ఇటీవల విడుదల చేసిన టీజర్ తో మరోసారి ప్రూవ్ అయ్యింది.

ఒక్క మన తెలుగులోనే మోస్ట్ వ్యూస్ సంపాదించిన టీజర్ గానే కాకుండా ఇప్పుడు ఇండియన్ వైడ్ హైయెస్ట్ వ్యూడ్ టీజర్స్ లో ఒకటిగా మరో భారీ రికార్డు సెట్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఇండియాలో అత్యధిక వ్యూస్ అందుకున్న టీజర్ గా “కేజీయఫ్ చాప్టర్ 2” 191 మిలియన్స్ తో ఉంది.

మరి దీని తర్వాత సూపర్ స్టార్ రజినీ నటించిన భారీ స్కై ఫై థ్రిల్లర్ “2.0” టీజర్ టీజర్ 72.44 మిలియన్ వ్యూస్ తో రెండో ప్లేస్ లో ఉండగా దాన్ని ఇపుడు పుష్ప టీజర్ బీట్ చేసి టాప్ 2 లోకి వచ్చింది. దీనితో ఇండియన్ వైడ్ గా మోస్ట్ వ్యూడ్ టీజర్స్ లో పుష్ప టీజర్ టాప్ 2 లో నిలిచి మరో సాలిడ్ మైల్ స్టోన్ ను అందుకుంది.

సంబంధిత సమాచారం :