50 మిలియన్ క్లబ్ లో “పుష్ప” చార్ట్ బస్టర్.!

Published on Sep 24, 2021 7:40 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్న హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “పుష్ప”. మొత్తం రెండు భాగాలుగా తెలుసుకున్న ఈ సినిమా నుంచి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ ఆల్బమ్ పై కూడా చాలా అంచనాలు నెలకొన్నాయి. మామూలుగానే దేవి, సుకుమార్ అల్లు అర్జున్ కాంబో అంటే ఆల్బమ్ పై వేరే లెవెల్ అంచనాలు ఉంటాయి.

అలానే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ మొత్తం 5 భాషల్లో భారీ హైప్ తో “దాక్కో దాక్కో మేక” ని రిలీజ్ చెయ్యగా దానికి భారీ రెస్పాన్స్ అన్ని భాషల్లో ను అందుకుంది. లేటెస్ట్ గా అయితే తెలుగులో వెర్షన్ వరకు 50 మిలియన్ మార్క్ ని ఈ సాంగ్ క్రాస్ చేసింది. అంతేకాకుండా ఈ సినిమా టీజర్ కి భారీ రెస్పాన్స్ తో 85 మిలియన్ మార్క్ ని ఇది క్రాస్ చేసింది. మరి ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :