“పుష్ప” కాంబో ఇంపాక్ట్ కూడా గట్టిగానే ఉంటుంది మరి.!

Published on Jul 2, 2021 4:51 pm IST

ఏ సినీ ఇండస్ట్రీలలో అయినా కూడా కొన్ని కాంబినేషన్స్ అంటే ఒక లెవెల్లో క్రేజ్ అలా ఉండిపోయింది అంతే.. మరి అలాంటి క్రేజీ ట్రయో కాంబినేషన్స్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ ల కాంబో ఒకటి. “ఆర్య” నుంచి మొదలైన వీరి ప్రస్థానం “ఆర్య 2” తర్వాత క్లాసిక్ కాంబోగా మారిపోయింది. అలాగే వీరి కాంబో నుంచి వచ్చిన మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా ఇప్పటికీ పెద్ద హిట్లే..

అందుకే ఈసారి “పుష్ప” పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు పాటల వల్ల కూడా సినిమాలు మరో స్థాయికి వెళ్తున్నాయి. అలాంటిది ఆల్రెడీ వీరిది హిట్టు కాంబో అందుకే మినిమమ్ అంచనాలు పుష్ప పై ఉన్నాయి. అలాగే మరోపక్క పలు భారీ చిత్రాల ఆడియో హక్కులకు రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయి.

ఈ క్రమంలో పుష్ప కి కూడా సాలిడ్ ఫిగర్ పలుకుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే సాంగ్స్ అన్ని సూపర్బ్ గా వస్తున్నాయని టాక్ ఉంది. సుకుమార్ టేస్ట్ అండ్ దేవీ ట్యూన్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. సో ఎలా లేదన్నా పాన్ ఇండియన్ లెవెల్లో పుష్ప ఆల్బమ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా గట్టిగానే ఉంటుందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :