సాయి ధరమ్ తేజ్ “విరూపాక్ష” చిత్రానికి పుష్ప కనెక్షన్

సాయి ధరమ్ తేజ్ “విరూపాక్ష” చిత్రానికి పుష్ప కనెక్షన్

Published on Dec 13, 2022 7:05 PM IST


మెగా హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా తన తదుపరి చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మిస్టికల్ థ్రిల్లర్‌కి కార్తీక్ దండు దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. టైటిల్ టీజర్‌కు జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన వాయిస్ ఓవర్ ఉండటం తో సినిమా పై ఆసక్తి నెలకొంది. ఈ టైటిల్ వీడియో కి మంచి స్పందన వచ్చింది. అయితే ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ పుష్పతో ఈ సినిమా తెరకెక్కనుందనేది తాజా సమాచారం.

వివరాల్లోకి వెళితే, పుష్ప చిత్రాన్ని హిందీలో విడుదల చేసిన గోల్డ్‌మైన్స్ టెలిఫిలిమ్స్ ఇప్పుడు విరూపాక్ష ను నార్త్ ఇండియన్ సర్క్యూట్‌లలో విడుదల చేస్తోంది. హిందీ టైటిల్ గ్లింప్స్ రేపు ఉదయం 10:30 గంటలకు విడుదల కానుంది. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ కథానాయిక గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21, 2023 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అంజనీష్ లోకనాథ్ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు