ఇండియాలో “పుష్ప” పై పెరుగుతున్న క్రేజ్.!

Published on Jun 27, 2021 9:39 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంలో మొదటి భాగం ఇపుడు శరవేగంగా జరుపుకుంటుంది. మరి ఇప్పుడు లాస్ట్ స్టేజ్ లో ఉన్న ఈ చిత్రం షూటింగ్ ఉంది. అయితే బన్నీ చేస్తున్న మొదటి పాన్ ఇండియన్ సబ్జెక్ట్ ఇది కావడంతో ముందు నుంచీ మంచి అంచనాలు ఉన్నాయి.

అయితే మరి ఇది ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గరే మోస్ట్ అవైటెడ్ వరకు వెళ్ళిపోయింది. ఇటీవలే ఐ ఎం డి బి లో మోస్ట్ అవైటెడ్ జాబితాలో పుష్ప అత్యధిక రేటింగ్ తో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. దీనితో పుష్ప క్రేజ్ ఎంతలా పెరుగుతుందో మనం అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :