‘పుష్ప’ నాన్ స్టాప్ బీట్స్..మరో మైల్ స్టోన్.!

Published on Sep 2, 2021 9:00 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప ది రైజ్”. ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ దర్శకత్వంలో ప్లాన్ చేసిన ఈ భారీ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా ఇప్పుడు ఫైనల్ షెడ్యూల్ లో బిజీగా ఉంది. అయితే ఈ చిత్రం నుంచి గత కొన్ని రోజులు కితం వచ్చిన మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ అన్ని భాషల్లో కూడా భారీ రెస్పాన్స్ ని అందుకుంది.

మరి రీసెంట్ గానే అన్ని భాషల్లో కలిపి మరో సాలిడ్ మైల్ స్టోన్ ని అందుకుంది. 50 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించి ఇంకా స్పీడ్ తో కొనసాగుతూ చార్ట్ బస్టర్ లా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సాంగ్ అన్ని భాషల్లో కూడా హిట్ అవ్వడంతో ఈ ఫీట్ అందుకుంది అని చెప్పాలి. మరి ఇప్పుడు సెకండ్ సింగిల్ కోసం అంతా మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అది ఈ సెప్టెంబర్ లోనే రిలీజ్ కానుంది అని బజ్ ఉంది మరి అది ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :