పుష్ప ఫస్ట్ సింగిల్ కి భారీ గా వ్యూస్!

Published on Aug 15, 2021 2:51 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం లో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్ర లో లారీ డ్రైవర్ గా కనిపిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్ మరియు ఫస్ట్ గ్లింప్స్ విడుదల అయి భారీ రెస్పాన్స్ కొల్లగొట్టింది. అదే తరహాలో అయిదు భాషల్లో విడుదల అయిన పుష్ప ఫస్ట్ సింగిల్ భారీ వ్యూస్ సాధించడం జరిగింది. ఇప్పటి వరకూ ఐదు బాషల్లో పుష్ప 25 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలు గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటి భాగం ఈ ఏడాది డిసెంబర్ లో రానుంది. ఈ చిత్రం సుకుమార్ కి మరియు అల్లు అర్జున్ కి పాన్ ఇండియన్ మూవీ కావడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మీక మందన్న నటిస్తుండగా, ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.

దాక్కో దాక్కో సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :