“పుష్ప” ఫస్ట్ సింగిల్..బన్నీ, దేవీ ల మాస్ కి డెఫినిషన్.!

Published on Aug 13, 2021 11:09 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియన్ లెవెల్లో ప్రెజెంట్ చెయ్యడానికి రెడీగా ఉన్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ ఎంటర్టైనర్ నుంచి మేకర్స్ మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఎట్టకేలకు ఈ మాస్ నెంబర్ ని మేకర్స్ వదిలారు.

అయితే సుకుమార్, బన్నీ, దేవి ల కాంబో ఆడియో అంటే ఏ రేంజ్ అంచనాలు ఉంటాయో ఆ అంచనాలు అన్నిటికి తగ్గట్టుగానే ఎక్కడా తగ్గకుండా హై ఎనర్జిటిక్ గా ఈ సాంగ్ ఉందని చెప్పాలి. దాక్కో దాక్కో మేక అంటూ చేస్తూ ఇచ్చిన ఈ సాంగ్ లో ముఖ్యంగా దేవి ఇచ్చిన బీస్ట్ ఫోక్ అండ్ మాస్ లో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్రెష్ గా ఉన్నాయి.

అంతే కాకుండా చంద్రబోస్ గారి లిరిక్స్ కానీ సాంగ్ విజువల్స్ కానీ అవుట్ అండ్ అవుట్ మాసివ్ గా ఉన్నాయని ఓవరాల్ గా మాత్రం ఈ సాంగ్ కోసం ఎదురు చూస్తున్న ఆడియెన్స్ అందరికీ దేవి అండ్ బన్నీ కాంబో మాస్ కి డెఫినిషన్ చూపించారని చెప్పాలి. ఇక రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ చిత్రాన్ని రెండు భాగాలుగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

దాక్కో దాక్కో సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :