‘పుష్ప’లో ట్రీట్ ఇవ్వబోయే ఆ హాట్ భామ ఎవరు ?

Published on May 14, 2021 1:00 am IST

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న ‘పుష్ప’ రెండు భాగాలుగా రానున్న సంగతి తెలిసిందే. అనూహ్యంగా దర్శక నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టడానికి బృందం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. రెండు భాగాలకు కలిపి సుమారు రూ.250 కోట్ల వరకు బడ్జెట్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ చాలా వరకు కంప్లీట్ కాగా ఇంకొద్దిగా మాత్రమే బ్యాలన్స్ ఉంది. పూర్తిస్థాయి మాస్ ఎంటర్టైనర్ అయిన ఇందులో మాస్ ప్రేక్షకులను అలరించే అన్ని రకాల అంశాలను జోడిస్తున్నారు సుకుమార్.

మాస్ ఎంటర్టైనర్ అంటే స్పెషల్ సాంగ్ తప్పనిసరి. అందుకే మంచి మాస్ మసాలా పాటను ప్లాన్ చేస్తున్నారట సుకుమార్. ఈ పాటలో స్టార్ కథానాయికను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. సుకుమార్ మనసులో పూజా హెగ్డే, దిశా పఠానీ ఇద్దరూ ఉన్నారని టాక్. సుకుమార్ గత చిత్రం ‘రంగస్థలం’లో జిగేలు రాణిగా స్పెషల్ సాంగ్ చేసి మెప్పించింది పూజా. ఆ పాట చాలా పెద్ద విజయాన్ని అందుకుంది. కాబట్టి సెటిమెంట్ మేరకు ఆమెను రిపీట్ చేసే అవకాశం ఉంది. అలాగే కొద్దిగా కొత్తదనం కోసం, హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం దిశా పఠానీని తీసుకున్నా తీసుకోవచ్చు. మరి ఇద్దరిలో ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి.

సంబంధిత సమాచారం :