గెట్ రెడీ..స్పెషల్ అప్డేట్ తో వస్తున్న “పుష్ప” మేకర్స్.!

Published on Jan 28, 2021 8:58 am IST

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న మొట్ట మొదటి పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. ఇది పాన్ ఇండియన్ సినిమా కావడం అందులోని బన్నీ హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండంతో దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

మరి ఇదిలా ఉండగా ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా తాలూకా షూట్ ను లేట్ గానే మొదలు పెట్టినా అప్డేట్స్ పరంగా బన్నీ ఫ్యాన్స్ ను ఎక్కడ నిరాశ పరచకుండా ప్లాన్ చేస్తూనే వస్తున్నారు. మరి ఇదిలా ఉండగా పుష్ప మేకర్స్ నుంచి మరో స్పెషల్ అప్డేట్ ఈరోజు రానున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఆ అప్డేట్ ఏంటి అన్నది తెలియాలి అంటే ఇంకాస్త ఆగాల్సిందే. అప్పటి వరకు బన్నీ ఫ్యాన్స్ మైత్రి మూవీ మేకర్స్ హ్యాండిల్ ను ట్యూన్ చేస్తూ ఉండాల్సిందే. ఇక ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఇంకా విలన్ ఎవరో రివీల్ కావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More