“పుష్ప” షూట్ పై అప్డేట్ తెలియజేసిన మేకర్స్.!

Published on Feb 6, 2021 2:00 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “పుష్ప”. పాన్ ఇండియన్ లెవెల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూట్ ను జరుపుకుంటుంది. కోవిడ్ వల్ల కాస్త లేట్ అయినా ఒక్కసారి స్టార్ట్ చేసాక మేకర్స్ ఆగలేదు.

మరి అలా అడవుల్లో కీలక షెడ్యూల్ ను పూర్తి చేసారు. మరి దీనిపైనే మేకర్స్ అధికారిక అప్డేట్ ను కూడా ఇప్పుడు ఇచ్చారు. మారేడుమిల్లి మరియు రంపచోడవరం అడవుల్లో తమ చిత్రం షూట్ ను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. అలాగే ఈ షూట్ కు సహకరించిన గిరిజనులు వారు అన్ని విధాలా అందించిన సహాయంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

అంతే కాకుండా మళ్ళీ కలుద్దాం అని కూడా హింట్ ఇచ్చారు. అంటే మళ్లీ రంపచోడవరం మరియు మారేడుమిల్లి అడవుల్లో షూట్ ఉందని మేకర్స్ చెప్పకనే చెప్పేసారు. మరి ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :