అప్పుడే అయిపోలేదు..”పుష్ప” పై తగ్గేదేలే అంటున్న మేకర్స్.!

Published on Apr 8, 2021 1:00 pm IST

లేటెస్ట్ పుష్ప టీజర్ తో తన బ్రాండ్ మార్క్ మార్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో గట్టిగా నడుస్తున్నాయి. మరి ఈ వేడుకలకు మరింత హైప్ ఇస్తూ టీజర్ కూడా దూసుకెళ్తూ లేటెస్ట్ గా 12 మిలియన్ వ్యూస్ మార్క్ సహా 6 లక్షలకు పైగా లైక్స్ ను ఇది కొల్లగొట్టింది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి నిర్మాతలు మరో సాలిడ్ అనౌన్సమెంట్ ఇచ్చారు.

ఈ చిత్రం నుంచి అప్డేట్స్ అప్పుడే అయ్యిపోలేదు మరిన్ని అప్డేట్స్ సిద్ధంగా ఉన్నాయి తగ్గేదే లే అంటున్నారు. దీనితో బన్నీ ఫ్యాన్స్ కు మరింత బూస్టప్ వచ్చినట్టు అయ్యింది. మరి మేకర్స్ ఎప్పుడు ఎలాంటి అప్డేట్స్ ను ఇవ్వనున్నారో చూడాలి. ఇక ఈ భారీ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తుండగా రష్మికా మందన్నా బన్నీ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా రిచ్ వాల్యూస్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :