“పుష్ప”లో ఇది మరో మైండ్ బ్లోయింగ్ సీక్వెన్స్ అంట!

Published on Nov 29, 2020 5:08 pm IST

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా టాలీవుడ్ ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ భారీ పాన్ ఇండైన చిత్రం “పుష్ప”. కేవలం పాన్ ఇండియన్ సినిమాగా అనౌన్స్ చేసారని కాకుండా బన్నీ మరియు సుక్కు ల కాంబో నుంచి వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ మరింత స్పెషల్ గా మారింది.

అయితే ఈ ఏడాది వచ్చిన కష్టతరం పరిస్థితులను తప్పుకొని ఎట్టకేలకు ఒక పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో షూట్ ను స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు మరో మైండ్ బ్లోయింగ్ సన్నివేశాన్ని తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. ఇది కథలోని అలాగే అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప రాజ్ రోల్ కు సంబంధించి ఒక కీలకమైన ఎపిసోడ్ అన్నట్టు టాక్. అయితే ఇది యాక్షన్ సీక్వెన్స్ కాదు అన్నట్టు కూడా వినిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More