“పుష్ప” మూవీపై ఫస్ట్ రివ్యూ.. ఎలా ఉందంటే?

Published on Dec 15, 2021 11:40 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “పుష్ప”. పాన్‌ ఇండియన్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుద‌ల చేయ‌నున్నారు. మొదటి భాగం “పుష్ప ది రైజ్” పేరుతో డిసెంబర్ 17వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాలున్న ఈ సినిమాపై ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది.

యూఏఈ సెన్సార్‌ బోర్డు సభ్యుడు, ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమైర్‌ సంధు పుష్ప చిత్రంపై రివ్యూ చెప్పేసాడు. సినిమా చాలా బాగుందని, అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చాడని, రష్మిక అద్భుతంగా నటించిందని, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా పండిందని అన్నారు. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, సుకుమార్‌ దర్శకత్వం అమేజింగ్‌గా ఉందని అన్నారు. మొత్తంగా చెప్పాలంటే ‘పుష్ప’ మూవీ ఈ ఏడాదిలో ఉత్తమ టాలీవుడ్‌ చిత్రంగా నిలుస్తుందని చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :