పుష్ప ఫస్ట్ సింగిల్ పై రీల్స్ షురూ చేసిన పుష్ప టీమ్!

Published on Aug 16, 2021 1:15 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఈ చిత్రం లో పుష్పరాజ్ పాత్ర లో అల్లు అర్జున్ ఊర మాస్ గెటప్ లో కనిపిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో ఈ చిత్రం కొనసాగనుంది. ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ఇటీవల విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. పుష్ప ఫస్ట్ సింగిల్ కి అయిదు బాషల్లో భారీ వ్యూస్ వచ్చాయి.

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో పాన్ ఇండియన్ మూవీ కావడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి విడుదల అయిన దాక్కో దాక్కో మేక పాట అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ పాటలో అహ్ అహ్ అహ్ స్టెప్ ను ఇప్పుడు ఇన్ స్తా రీల్స్ లో పుష్ప టీమ్ పెట్టడం జరిగింది. ఈ పాట కి ఇమిటేశన్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉండటం తో చిత్ర యూనిట్ ఇలా రీల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం లో హీరోయిన్ గా రష్మీక మందన్న నటిస్తుండగా, సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :