పది “కేజీయఫ్” లు కలిపితే “పుష్ప” పార్ట్ 1 అట.!

Published on Jun 14, 2021 9:00 am IST

ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ మాస్ కల్ట్ క్లాసిక్ ఇప్పుడున్న సినిమాల్లో ఏదన్నా ఉంది అంటే అది కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన “కేజీయఫ్ చాప్టర్ 1” అనే చెబుతారు అందరు. ఈ సినిమాలోని మాస్ ఎలివేషన్స్ కానీ ప్రశాంత్ నీల్ టేకింగ్ కానీ అన్ని భాషల్లోని కూడా ఒక రేంజ్ లో ఈ చిత్రాన్ని నిలబెట్టింది.

మరి ఇదిలా ఉండగా అలాంటి కేజీయఫ్ నే ఒక పదింటిని కలిపితే ఒక్క “పుష్ప పార్ట్ 1” అవుతుందని దర్శకుడు సుకుమార్ అసిస్టెంట్ మరియు “ఉప్పెన” దర్శకుడు బుచ్చిబాబు సానా అంటున్నారు. లేటెస్ట్ గా ఇచ్చిన ఓ క్లబ్ హౌస్ ఇంట్రాక్షన్ లో ఇది తెలిపారు. తాను పార్ట్ 1 చూశానని అందులో బన్నీ నటన కానీ సుకుమార్ గారి మాస్ ఎలివేషన్స్ కానీ ఒక పది కేజీయఫ్ లని కలిపితే పుష్ప పార్ట్ 1 అని తెలిపాడు. దీనితో ఇది విన్న బన్నీ అభిమానులకు మరింత హై వచ్చింది.. మరి ఈ లెక్కన పుష్ప ఎక్కడా కూడా “తగ్గేదే లే” అనిపించేలానే ఉంది..

సంబంధిత సమాచారం :