జెట్ స్పీడ్ లో “పుష్ప” పార్ట్ 1..!

Published on Jun 15, 2021 2:00 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ హ్యాట్రిక్ చిత్రం “పుష్ప”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ పాన్ ఇండియన్ చిత్రం షూట్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. ఇప్పటికే రెండు పార్టులుగా ప్లాన్ చేసిన ఈ భారీ చిత్రంలో లారెడీ సెకండ్ పార్ట్ 10 శాతం పూర్తి చేయగా పార్ట్ కి ఇప్పటి వరకు 80 శాతం పూర్తి చేసేసారట.

ఇక అలాగే ఈ మిగతా బ్యాలన్స్ షూట్ ను సింగిల్ షాట్ లో తేల్చేయాలని సుకుమార్ ఫిక్స్ అయ్యారట. అందుకే వచ్చే జూలై చివరి నాటికి షూట్ ని కంప్లీట్ చేసేయాలని ప్లాన్ చేశారట. అందుకే ఆల్రెడీ ఈ షూట్ జెట్ స్పీడ్ తో హైదరాబాద్ లోనే నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :