ఆ డేట్ నుంచి “పుష్ప” రాజ్ వేట మొదలు పెట్టనున్నాడట.!

Published on Jul 4, 2021 2:00 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప”. ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరెకక్కిస్తున్న ఈ పాన్ ఇండియన్ చిత్రంపై భారీ అంచనాలు కూడా నెలకొన్న సంగతి తెలిసిందే. మరి ఇదిలా ఉండగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా వాటిలో పుష్ప పార్ట్ 1 ఆల్రెడీ ఆల్ మోస్ట్ కంప్లీట్ కాగా బ్యాలన్స్ షూట్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.

మరి తాజా టాక్ ప్రకారం పుష్ప రాజ్ వేట మళ్ళీ ఈ జూలై 7 నుంచి మొదలు కానున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ మేకర్స్ ఆ సన్నాహాలు పూర్తి చేశారట. ఇక బన్నీ పుష్ప రాజ్ లా రంగంలోకి దిగడమే బ్యాలన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సాలిడ్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఫహద్ ఫాజిల్ విలన్ గా గ్లామరస్ యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :