భారీ రికార్డ్స్ తో కొనసాగుతున్న “పుష్ప” రాజ్ ర్యాంప్.!

Published on Jun 16, 2021 10:00 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ స్టార్డం కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ సోషల్ మీడియా మాధ్యమంలో అయినా కూడా భారీ క్రేజ్ బన్నీకి ఉంది.. యూట్యూబ్ రికార్డ్స్ విషయానికి వస్తే సరికొత్త రికార్డ్స్ సెట్ చెయ్యడం కూడా బన్నీ నుంచే స్టార్ట్ అయ్యిందని చెప్పాలి. అలా ఇప్పుడు తాను చేసిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”తో మరోసారి ర్యాంప్ ఆడిస్తున్నాడు ఈ పుష్ప రాజ్.

అసలు తెలుగు మొట్టమొదటి 70 మిలియన్ వ్యూస్ మరియు గా 1.5 మిలియన్ లైక్స్ కొల్లగొట్టిన ఫస్ట్ ఎవర్ టీజర్ గా సెన్సేషనల్ రికార్డును సెట్ చేసాడు బన్నీ. మరి అదే స్పీడ్ ఇప్పటికీ కొనసాగుతూ 73 మిలియన్ వ్యూస్ మరియు నెవర్ బిఫోర్ 1.7 మిలియన్ లైక్డ్ టీజర్ గా మరో భారీ రికార్డును సెట్ చేసి మరోసారి హాట్ టాపిక్ అవుతున్నాడు. ఇది మాత్రం మామూలు స్పీడ్ కాదని చెప్పాలి.

దీనితో ఈ లెక్కలు ఇంకెక్కడ ఆగుతాయో అన్నది కూడా ఆసక్తిగా మారింది. మరి ఈ భారీ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తుండగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :