సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తున్న “పుష్ప”రాజ్.!

Published on Apr 8, 2021 9:00 am IST

మొదటగా మా 123తెలుగు టీం నుంచి బన్నీకి జన్మదిన శుభాకాంక్షలు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్యాగ్ ను కాస్తా ఐకానిక్ స్టార్ గా మార్చేసిన లేటెస్ట్ చిత్రం “పుష్ప”. బన్నీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ లేటెస్ట్ చిత్రం భారీ అంచనాలు సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. మరి పాన్ ఇండియన్ లెవెల్ కు తగ్గట్టుగా కట్ చేసిన ఈ పుష్ప టీజర్ సాలిడ్ రెస్పాన్స్ ను ఇప్పుడు కొల్లగొడుతుంది.

మామూలుగానే బన్నీ వీడియోస్ యూట్యూబ్ లో ర్యాంప్ లెవెల్లో స్పీడ్ అందుకుంటాయి. కానీ పుష్ప టీజర్ మాత్రం మొదటి నుంచి మంచి మాస్ స్పీడ్ వ్యూస్ మరియు లైక్స్ ను సాధించింది. ఇప్పటికే 5 లక్షలు లైక్స్ క్రాస్ అయ్యిపోయిన ఈ టీజర్ ఓవరాల్ గా 1 మిలియన్ వెళ్లినా ఆశ్చర్యం పోనక్కర్లేదు అని చెప్పాలి.

మొత్తానికి మాత్రం పుష్ప రాజ్ మాస్ బాటింగ్ గట్టిగానే ఉందని చెప్పాలి. మరి ఈ భారీ చిత్రంలో బన్నీ సరసన రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :