‘పుష్ప’ యాభై మందితో నడిచిపోతోందా ?

Published on Apr 24, 2021 3:00 am IST

కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా స్టార్ హీరోలు, చిన్న హీరోలు అనే తేడా లేకుండా అందరూ పోయాక చెప్పేశారు. పెద్ద సినిమాలన్నీ ఆగిపోయాయి. ‘ఆచార్య, సర్కారు వారి పాట, రాధేశ్యామ్’ లాంటి పెద్ద సినిమాలన్నీ ఆగిపోయాయి. రవితేజ కూడ షూటింగ్ ఆపేసుకున్నారు. కానీ అల్లు అర్జున్ ‘పుష్ప’ మాత్రం ఆగలేదు. ఇప్పటికే చాలా ఆలస్యం కావడంతో సుకుమార్ అండ్ టీమ్ గట్టిగా వర్క్ చేస్తున్నారు. కీలక నటుడు ఫహాద్ ఫాజిల్ సైతం చిత్రీకరణలో జాయిన్ అయ్యారు. సుకుమార్ స్పీడ్ చూస్తుంటే పూర్తయ్యేదాకా ఆగేలా కనబడట్లేదు.

కానీ మరోవైపు కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి నిబంధనలు విధించింది. అత్యవసరం అనుకుంటే 50 మందికి మించని బృందంతో చిత్రీకరణ చేసుకోవాలని సూచించారు. అయితే ‘పుష్ప’ పెద్ద సినిమా. కేవలం 50 మందితో షూటింగ్ అంటే అస్సలు కుదరదు. సెట్లో కనీసం 150 నుండి 200 మంది వరకు సిబ్బంది ఉండాల్సిందే. ఈ లెక్కన నిర్మాతల మండలి సూచనలను ‘పుష్ప’ బృందం మీరిందనే అనుకోవాలేమో. లేకపోతే స్పషల్ అనుమతులేమైనా తీసుకుని షూట్ నడుపుతున్నారేమో.

సంబంధిత సమాచారం :