ఓ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్న “పుష్ప” టీం.!

Published on Jun 13, 2021 6:40 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప”. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరెకక్కిస్తున్న ఈ పాన్ ఇండియన్ సినిమాపై అనేక అంచనాలు కూడా ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టే సుకుమార్ కూడా ప్రతి అంశంలోకి గ్రాండియర్ తో పాటు సాలిడ్ కంటెంట్ ని కూడా సెట్ చేసి తీస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా ఇటీవలే బన్నీ కరోనా నుంచి కోలుకోవడంతో మళ్ళీ మేకర్స్ షూట్ కి రంగం సిద్ధం చేస్తుండగా ఇపుడు ఆసక్తికర బజ్ బయటకి వచ్చింది. మరి ఈ షూట్ కూడా ఒక సాలిడ్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ తోనే స్టార్ట్ చేయనున్నట్టు టాక్. ఇప్పటికే మేకర్స్ లొకేషన్స్ వేటలో ఉన్నారట అది కనుక ఫిక్స్ అయితే అక్కడే ఈ సీన్ ను తెరకెక్కిస్తారట. ఇందులో మరొకటి.. ఈ సీక్వెన్స్ అంతా నైట్ టైం లోనే ఉంటుందట. మరి ఈ సాలిడ్ సీక్వెన్స్ సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :