సుకుమార్ సహా అందరూ సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి ?

Published on Dec 4, 2020 1:00 am IST

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. ఈ సినిమా కోసం బన్నీ డీగ్లామర్ లుక్ లోకి మారారు. ఇంతవరకు కనిపించని మాస్ గెటప్లో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేసింది. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా, ఎంత త్వరగా విడుదలవుతుందా ఐ ఎదురుచూస్తున్నారు. కానీ సినిమా చిత్రీకరణకు కోవిడ్ రూపంలో వరుస అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి.

లాక్ డౌన్ మూలంగా 6 నెలలు షూటింగ్ వాయిదాపడింది. ఇటీవలే అన్ని జాగ్రత్తలు తీసుకుని మారేడుమిల్లి అడవుల్లో షూట్ స్టార్ట్ చేశారు. కానీ కొద్దిరోజులకే చిత్ర బృందంలో కరోనా అలజడి మొదలైంది. క్రూలోని కొందరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని చెబుతున్నారు. దీంతో ఉన్నపళంగా చిత్రీకరణ నిలిపివేసి హైదరాబాద్ కు పయనమయ్యారట టీమ్. చిత్రీకరణలో బన్నీ సహా ముఖ్య తారాగణం మొత్తం పాల్గొన్నారు. అందుకే సిటీకి తిరిగొచ్చాక సుకుమార్ సహా అందరూ సెల్ఫ్ ఐసోలేషన్ తీసుకుంటారట. ప్రస్తుతానికి అందరూ బాగానే ఉన్నా వారం గడిచాక కరోనా పరీక్షలు చేయించుకుంటారని చెబుతున్నారు.

సంబంధిత సమాచారం :

More