6వ రోజు “పుష్ప” రాజ్ నైజాం వసూళ్ల వివరాలు.!

Published on Dec 23, 2021 4:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ చిత్రం “పుష్ప ది రైజ్”. భారీ అంచనాలు నడుమ పాన్ ఇండియన్ వైడ్ గా రిలీజ్ అయ్యిన ఈ చిత్రం అని చోట్లా కూడా భారీ వసూళ్లతో రికార్డ్ బ్రేకింగ్ గా దూసుకెళ్తుంది. మరి నైజాం లో అయితే పుష్ప రాజ్ బ్యాటింగ్ గట్టిగానే ఉందని చెప్పాలి.

లేటెస్ట్ గా సినిమా ఆరవ రోజు వసూళ్ల వివరాలు తెలుస్తున్నాయి. నైజాం లో డే 6 పుష్ప 1.3 కోట్ల రూపాయలు షేర్ ని రాబట్టి డీసెంట్ హోల్డ్ ని కనబరిచింది. దీనితో పుష్ప నైజాం లో 31 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. ఆల్రెడీ ఈ సినిమా లాభాల్లోకి అక్కడ వెళ్ళిపోయినా సంగతి తెలిసిందే. ఇప్పుడు అన్నీ లాభాలే నైజాం లో ఉన్నాయి. ఇక మిగతా ఏరియాల్లో సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :