పీవీఆర్ పిక్చర్స్ తో రిలీజ్ కి రెడీ అయ్యిన ‘మెరిసే మెరిసే’

Published on Jul 18, 2021 10:52 am IST

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా ‘మెరిసే మెరిసే’. కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘మెరిసే మెరిసే’ చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు రెడీ అవుతుంది…

ఇక ఈ సందర్భంగా దర్శకుడు పవన్ కుమార్ కె మాట్లాడుతూ…నిర్మాత వెంకటేష్ కొత్తూరి సహకారంతో మెరిసే మెరిసే సినిమాను అనుకున్నట్లుగా తెరకెక్కించాం. ఇటీవలే సెన్సార్ వారు మా సినిమా చూసి అభినందించారు. క్లీన్ ‘ యూ ‘ సర్టిఫికెట్ ఇచ్చారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను విడుదల చేసిన పీవీఆర్ సంస్థ మా మెరిసే మెరిసే సినిమాను రిలీజ్ చేస్తుంటడం సంతోషంగా ఉంది. ఆగస్టు 6న మీ ముందుకొస్తున్నాం. మా సినిమా పాటలు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో కూడా ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ మెరిసే మెరిసేను హిట్ చేస్తారని ఆశిస్తున్నాం” అని తెలిపారు.

సంబంధిత సమాచారం :