“ప్యారీ తారావలి ది ట్రూ స్టోరీ” బుక్ రిలీజ్ కి సన్నాహలు!

“ప్యారీ తారావలి ది ట్రూ స్టోరీ” బుక్ రిలీజ్ కి సన్నాహలు!

Published on Jun 19, 2022 11:25 AM IST

pyyar

మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న చిత్రం ప్యారీ. లక్ష్మణ్ అనే యువకుడు, ప్యారీ అనే యువతి నడుమ నడిచిన ప్రేమకు సాక్షాత్కారమే ఈ చిత్రం. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుండగానే ఈ ప్రేమకథను పుస్తకం రూపంలో ప్యారీ తారావలి ది ట్రూ స్టోరీ పేరుతో ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్.

రజనీష్ దూబే రాసిన ప్యారీ తారావలి ది ట్రూ లవ్ స్టోరీ అమెజాన్, ఫ్లిప్ కార్ట్, కిండిల్, ప్లే స్టోర్, గూగుల్ బుక్స్, కోబో, ఐ బుక్స్ వంటి మాధ్యమాల్లో లభ్యం కానుంది. ప్రేమ తాలూకు ఓ గొప్ప పార్శ్వాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించే ప్యారి ప్రేమాస్పదులైన ప్రతి ఒక్కరినీ రంజింప చేస్తుందని దర్శకనిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు