కోలీవుడ్ విలక్షణ దర్శకుడు గౌతమ్ మీనన్ తమిళ నాడు మాజీ ముఖ్యమంత్రి, పురుచ్చి తలైవి జయలలిత జీవిత కథ ఆధారంగా వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ బయోపిక్ షూటింగ్ ను కంప్లీట్ చేశాడు గౌతమ్ మీనన్. క్వీన్ అనే టైటిల్ తో రానున్న ఈ వెబ్ సిరీస్ లో సీనియర్ నటి రమ్యకృష్ణ , జయలలిత పాత్రలో నటిస్తుండగా శోభన్ బాబు పాత్రలో యాక్టర్ వంశీ అలాగే ఎంజీఆర్ పాత్రలో మలయాళ నటుడు ఇంద్రజిత్ సుకుమారన్ నటిస్తున్నారు.
ఇక ఇది ఇలావుంటే లేడీ డైరెక్టర్ ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ అనే టైటిల్ తో ఏ ఎల్ విజయ్ ‘తలైవి’ అనే టైటిల్ తో జయలలిత జీవితం ఆదారంగా బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు.


