మనిషి ఉన్నంత వరకూ థియేటర్లు ఉంటాయి – ఆర్. నారాయణమూర్తి

మనిషి ఉన్నంత వరకూ థియేటర్లు ఉంటాయి – ఆర్. నారాయణమూర్తి

Published on Jul 29, 2021 2:00 AM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న పోరాటం ఇతివృత్తంగా నటుడు, దర్శక-నిర్మాత ఆర్‌.నారాయణమూర్తి ‘రైతన్న’ చిత్రాన్ని రూపొందించారు. తాజాగా ఈ చిత్రాన్ని ఆగస్టు 15న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్. నారాయణమూర్తి కరోనాకు సంబంధించిన నియమ నిబంధనలను పాటిస్తూనే, సినిమా థియేటర్లను నడిపించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రముఖ నిర్మాతలు, నిర్మాణ సంస్థలు తమ చిత్రాలను ఓటీటీ ద్వారా విడుదల చేయడాన్ని ఆయన తప్పుపట్టారు.

అయితే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వల్ల కేవలం ఇరవై ఐదు శాతం మంది మాత్రమే సినిమాలను చూడగలుగుతున్నారని, మిగిలిన 75 శాతం మంది చూడలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్‌లో సినిమా చూడడం ఒక పండగ అని, ప్రస్తుతం పేదవాడికి వినోదం అందడం లేదని అన్నారు. జనం మునపటిలా ధైర్యంగా థియేటర్లకు రావాలంటే ముందుగా పెద్ద సినిమాలను, క్రేజ్ ఉన్న సినిమాలను విడుదల చేయాలని కోరారు. థియేటర్లలో సినిమా చూస్తే కలిగే అనుభూతి చెప్పలేదని అసలు మనిషి ఉన్నంత వరకూ థియేటర్లు ఉంటాయని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు