“రాధే శ్యామ్” ఒక్క సెట్ కే భారీ ఖర్చు.!

Published on Jul 16, 2020 9:26 pm IST

యంగ్ రెబల్ ప్రభాస్ హీరోగా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ “రాధే శ్యామ్” ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పుకున్న ఈ చిత్రం వింటేజ్ ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాలో యూరోప్ నగరం బ్యాక్ డ్రాప్ లో కొన్ని కీలక సన్నివేశాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలా షూటింగ్ అక్కడ జరిగింది.

కానీ ఇప్పుడు ఊహించని విధంగా పరిస్థితులు మారిపోవడంతో ఇక విదేశాల్లో షూటింగ్స్ చేసే అవకాశం లేకుండా పోయింది. దీనితో విదేశాలనే ఇక్కడకు మన వాళ్ళు సెట్స్ రూపంలో తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ఈ చిత్రానికి ఓ భారీ సెట్టింగ్ ను మన దగ్గరే నిర్మించనున్నారట. దీనికి గాను దగ్గరగా 15 కోట్లు వెచ్చించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో మిగిలి ఉన్న టాకీ పార్ట్ సెట్టింగ్స్ లోనే జరగాల్సి ఉందని టాక్ వినిపించింది. అందులో భాగంగానే ఇప్పుడు యూరోప్ నగరాన్ని ఇక్కడ సినిమాకు సంబంధించిన మేర సెట్టింగ్ వేసి షూట్ చేయనున్నారట.

సంబంధిత సమాచారం :

More