సమీక్ష : “రాజధాని ఫైల్స్” – బోరింగ్ పొలిటికల్ డ్రామా

సమీక్ష : “రాజధాని ఫైల్స్” – బోరింగ్ పొలిటికల్ డ్రామా

Published on Feb 16, 2024 3:03 AM IST
Raajadhani Files Movie Review in Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 15, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్, పవన్, విశాల్ పట్నీ, షణ్ముఖ్, మధు, అజయ్ రత్నం, అమృత చౌదరి, అంకిత ఠాకూర్

దర్శకుడు : భాను

నిర్మాత: కంఠమనేని రవిశంకర్

సంగీత దర్శకులు: మణిశర్మ

సినిమాటోగ్రాఫర్‌లు: రమేష్

ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు

సంబంధిత లింక్స్: ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో పొలిటికల్ డ్రామా “రాజధాని ఫైల్స్” కూడా ఒకటి. మరి ప్రముఖ నటుడు వినోద్ కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ :

ఇక కథలోకి వస్తే..బుల్లురు అనే గ్రామానికి చెందిన గౌతమ్(పుష్పరాజ్ అఖిలన్) మొదట అంత ఆసక్తి కనబరచకపోయినప్పటికీ తరువాత అరుణప్రదేశ్ కి చెందిన కొత్త రాజధాని ఐరావతి కోసం ఇచ్చిన భూముల విషయంలో అక్కడి రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి వారితో పోరాటం చేయడానికి సిద్ధం అవుతాడు. మరి అప్పుడే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న (విశాల్ పట్నాని) ఐరావతిని రాజధాని కాదని డిక్లేర్ చేయడంతో రైతులు తీసుకున్న నిర్ణయం ఏంటి? వారికి గౌతమ్ ఎలా సహాయం అందిస్తాడు చివరికి ఎవరు గెలిచారు అనేది ఈ సినిమాలో మిగతా సారాంశం.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో కీలక పత్రాలు పాత్రలు పోషించిన సీనియర్ నటుడు వినోద్ కుమార్ అలాగే వాణి విశ్వనాథ్ లు తమ పాత్రల పరిధి మేరకు మంచి నటనతో ఆకట్టుకుంటారు. అలాగే కొన్ని సీన్స్ లో వారి నటన బాగుంది. అలాగే ముఖ్య పాత్రలో కనిపంచిన పుష్పరాజ్ అఖిలన్ తన రోల్ ని మంచి పెర్ఫామెన్స్ తో రక్తి కట్టించాడు అని చెప్పాలి.

అలాగే మెయిన్ గా సెకండాఫ్ లో తన రోల్ పై కొన్ని సన్నివేశాలు అందులో తన పెర్ఫామెన్స్ బాగుంది. ఇక వీరితో పాటుగా ఇతర సహాయక తారాగణం తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకుంటారు. అలాగే కొన్ని సీన్స్ ఈ సినిమా కోసం కేవలం ఆ సీన్స్ కోసం ఎదురు చూసే వర్గానికి నచ్చవచ్చు.

మైనస్ పాయింట్స్ :

ప్రస్తుతం నెలకొన్న కొన్ని పరిస్థితుల్లో కొందరు ఈ సినిమా కోసం ఎదురు చూసి ఉండొచ్చు కానీ ఈ సినిమా వారిని కూడా పూర్తి స్థాయిలో మెప్పించే రేంజ్ లో లేదని చెప్పడంలో సందేహం లేదు. అలాగే ఇది ఫిక్షనల్ సినిమా అయినప్పటికీ కొన్ని నిజ జీవిత సంఘటనల ప్రేరణగా కల్పిత సీన్స్ తో చేశారు.

కానీ చూసే ఆడియెన్స్ కి నచ్చే విధమైన ఎంగేజింగ్ నరేషన్ ఈ సినిమాలో లోపించింది. ముఖ్యంగా మంచి ఎమోషన్స్ బాగా మిస్ అయ్యాయి. దీనితో రాజధాని ఫైల్స్ లో అసలు ఎమోషన్ అనేది వర్కౌట్ అవ్వదు. పై పెచ్చు సినిమా చాలా బోరింగ్ గా సాగదీతగా అనిపిస్తుంది.

అలాగే ఈ తరహా చిత్రాల్లో క్యాస్టింగ్ చాలా ముఖ్యం. కొన్ని పాత్రల విషయంలో సినిమాలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కాస్త పాత్రలకి సూటయ్యే నటీనటుల్ని చూపించినా కొంచెం అయినా చూసే ఆడియెన్ కి ఆసక్తి రేగొచ్చు కానీ అది కూడా ఈ చిత్రంలో లోపించింది.

ఇక సీఎం పాత్రలో కనిపించిన నటుడు విశాల్ పట్నాని పై కొన్ని పేలవమైన సీన్స్ డిజప్పాయింట్ చేస్తాయి. అలాగే సినిమాలో పాటలు కూడా కూడా అంత వర్కవుట్ అవ్వలేదు.

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు పర్వాలేదని చెప్పొచ్చు. ఇక టెక్నికల్ టీం లో మణిశర్మ మ్యూజిక్ కూడా ఓకే అనిపిస్తుంది. అలాగే సినిమాటోగ్రఫీ ఓకే, ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది.

ఇక దర్శకుడు భాను విషయానికి వస్తే.. రాజధాని ఫైల్స్ అనే మంచి ఎమోషన్ ని తాను కంటెంట్ గా తీసుకున్నారు కానీ ఆ ఎమోషన్ ని తెరపై ఆవిష్కరించడంలో మాత్రం డిజప్పాయింట్ చేసారని చెప్పాలి. ఏవో కొన్ని సీన్స్ వరకు ఓకే కానీ ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాగా మాత్రం ఇది ఏమాత్రం మెప్పించదు.మెయిన్ గా ఎమోషన్స్ ని ఎస్టాబ్లిష్ చేయడంలో దర్శకుడు విఫలం అయ్యారు.

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “రాజధాని ఫైల్స్” ఏదో అవుతుంది అనుకుంటే ఇంకేదో అయ్యిందని చెప్పాలి. ప్రధాన తారాగణం నటన పరంగా మెప్పించినా సినిమాలో అసలు మెయిన్ ఎమోషన్ అనేది వర్కౌట్ అవ్వలేదు. బోరింగ్ అండ్ డల్ నరేషన్ తో సినిమా ఏమాత్రం మెప్పించదు. కనీసం ఈ సినిమాలో ఏదో ఉంటుంది అనుకున్న ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ని ఈ సినిమా ఎంగేజ్ చెయ్యలేదు. దీనితో ఈ వారాంతానికి ఈ సినిమాకి దూరంగా ఉండడమే మంచిది.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు