ఇంటర్వ్యూ : రాశి ఖన్నా – ‘వెంకీమామ‌’ కోసమే కొంచెం సన్నబడ్డాను.

Published on Dec 5, 2019 5:01 pm IST

టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న మ‌ల్టీస్టారర్ `వెంకీమామ‌`. విక్ట‌రీ వెంక‌టేశ్‌, యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 13న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంధర్భంగా రాశి ఖన్నా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ విశేషాలు మీకోసం.

 

ఏంటి..సన్నబడినట్టున్నారు, ఏదైనా పాత్ర కోసమా?

అవును ఈ మధ్య జిమ్ లో బాగా కష్టపడి కొంచెం బరువు తగ్గాను. ఐతే పాత్ర కోసం కాదు. గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఫిట్ గా సన్నగా ఉండాలి. అప్పుడే వైవిధ్యమైన పాత్రలు చేసే అవకాశం దక్కుతుంది. దాని కోసమే కొంచెం సన్నబడ్డాను.

 

వెంకీ మామ లో మీ పాత్ర ఏమిటీ?

వెంకీ మామ చిత్రంలో నాపాత్ర పేరు హారిక. ఒక లేడీ డైరెక్టర్ గా కనిపిస్తాను. నా పాత్ర ఈ సినిమాలో చాలా బాగుంటుంది.

 

ఈ చిత్రంలో అవకాశం ఎలా వచ్చింది?

నేను విశాల్ అయోగ్య మూవీ షూటింగ్ లో ఉన్నప్పుడు సురేష్ బాబు గారు ఫోన్ చేసి వెంకీ మామ మూవీలో హీరోయిన్ గా చేస్తారా అని అడిగారు. ఆతరువాత నేను ఆయన్ని కలవడం, ఈ మూవీలో చేయడానికి ఒప్పుకోవడం జరిగింది.

 

నాగ చైతన్య తో చేసిన అనుభవం ఎలా ఉంది?

గతంలో నేను చైతూ తో మనం సినిమాలో చిన్న పాత్ర చేశాను. ఐతే అది కేవలం ఒక్క రోజు షూట్ లో పూర్తయింది. తరువాత ఇన్నేళ్ల తరువాత ఈ చిత్రంలో చైతూ పక్కన చేసే అవకాశం దక్కింది. చైతు నాకు మధ్య లవ్ ఎపిసోడ్స్ చాలా రొమాంటిక్ మరియు ఎమోషనల్ గా ఉంటాయి.

 

వేంకటేష్ గారితో కలిసి నటించడం ఎలా అనిపించింది ?

 

అమేజింగ్ అండి. అందరికీ తెలుసు ఆయన కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. ఆయన ఎక్స్ ప్రెషన్స్ యూనిక్ గా ఉంటాయి. ఆయన నుండి ఎంతో నేర్చుకున్నాను. ఆయనకు నేను పెద్ద అభిమానిని.

 

ఇద్దరు హీరోలు ఉన్న ఈ సినిమాలో మీ రోల్ కు ఎంత ప్రాముఖ్యత ఉంటుంది ?

 

హారిక అనే ఫిల్మ్ మేకర్ క్యారెక్టర్ లో కనిపిస్తాను. బాబీగారు నా క్యారెక్జ్టర్ ను చాల బాగా డిజైన్ చేశారు. సినిమాలో నా పాత్ర కూడా కీలకంగానే ఉంటుంది.

 

ఈ మధ్య మీరు మీ పాత్రకు మీరే డబ్బింగ్ చెబుతున్నారు ?

 

నాకు చిన్నప్పటి నుండీ సింగింగ్ అంటే బాగా ఇంట్రస్ట్ అండి. అందుకే డబ్బింగ్ పై ఇంట్రస్ట్.. వరల్డ్ ఫేమస్ లవర్ కోసం నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాను. బట్ ఈ సినిమాకు చెప్పలేదు. ఆ టైంలో వేరే షూట్ లో బిజీగా ఉండటం వల్ల డబ్బింగ్ చెప్పలేకపోయాను. ఇక నుండి డబ్బింగ్ చెప్పడం కంటిన్యూ చేస్తాను.

 

వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తారా ?

 

ఇప్పుడు చాలామంది వెబ్ సిరీస్ ల్లో యాక్ట్ చేస్తున్నారు. మంచి రోల్ వస్తే నేను కూడా ఖచ్చితంగా యాక్ట్ చేస్తాను.

 

మీ తదుపరి సినిమాల గురించి ?

 

ప్రస్తుతం వెంకీమామ అండ్ ప్రతిరోజూ పండగే మూవీస్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను.

సంబంధిత సమాచారం :

More