వెంకీమామ షూటింగ్ లో జాయిన్ అయిన క్రేజీ హీరోయిన్ !

Published on Mar 2, 2019 11:01 pm IST


శ్రీనివాస కళ్యాణం తరువాత కోలీవుడ్ లో బిజీ అయ్యింది ఢిల్లీ బ్యూటీ రాశిఖన్నా. ప్రస్తుతం అక్కడ మూడు చిత్రాల్లో నటిస్తుంది. ఇక ఇటీవల వెంకీమామ అనే చిత్రానికి సైన్ చేసింది ఈ హీరోయిన్. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ రాజమండ్రి లో జరుగుతుంది. తాజాగా ఈ షెడ్యూల్ లో జాయిన్ అయ్యింది రాశి ఖన్నా. ఆమె ఈ చిత్రంలో నాగ చైతన్య కు జోడిగా నటిస్తుంది.

కామెడీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిత్రంలో వెంకీ రైస్ మిల్లర్ ఓనర్ గా నటిస్తుండగా చైతూ మిలిటరీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. వెంకీ కి జోడీగా పాయల్ రాజ్ పుత్ నటించనుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జై లవ కుశ ఫేమ్ బాబీ తెరకెక్కిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More