బరువు తగ్గడంపై స్పందించిన రాశి ఖన్నా

బరువు తగ్గడంపై స్పందించిన రాశి ఖన్నా

Published on Dec 9, 2015 6:16 PM IST

Rasi-kanna
రాశి ఖన్నా.. తెలుగులో ప్రస్తుతం వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోన్న హీరోయిన్. తాజాగా రవితేజ సరసన ఆమె హీరోయిన్‌గా నటించిన ‘బెంగాల్ టైగర్’ సినిమా రేపు (డిసెంబర్ 10న) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. తమన్నా మేజర్ హీరోయిన్‌గా నటించగా, రాశి ఖన్నా సెకండ్ హీరోయిన్‌గా నటించారు. ఇక తన కెరీర్లో మొదట్నుంచీ కొంత బొద్దుగానే కనిపిస్తూ వచ్చిన రాశిఖన్నా ఈ సినిమా కోసం మాత్రం బాగా సన్నబడ్డారు.

ఇదే విషయం గురించి రాశిఖన్నా మాట్లాడుతూ.. “బెంగాల్ టైగర్ కోసం సన్నబడాలని ముందే డిసైడ్ అయ్యా. సినిమా సినిమాకూ యాక్టింగ్ పరంగా, లుక్ పరంగా కొత్తగా కనిపిస్తే బాగుంటుందనే ట్రైనర్ ఆధ్వర్యంలో బరువు తగ్గా. అదీకాక ఫిట్‌గా ఉండడం కూడా మంచి విషయమేగా!” అని తెలిపారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన బెంగాల్ టైగర్ సినిమాను కె.కె. రాధామోహన్ నిర్మించారు.

తాజా వార్తలు