సాయి పల్లవి స్థానంలో రాశిఖన్నా!
Published on Feb 27, 2018 7:18 pm IST

నితిన్ ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో చల్ మోహన్ రంగ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా టిజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఆ సినిమా పూర్తయిన వెంటనే శ్రీనివాస కళ్యాణం సినిమాలో నటించబోతున్నాడు నితిన్. సతీష్ వేగ్నేష్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. మిక్కి జే మేయర్ సంగీతం సమకూరుస్తున్న ఈ నిమాలో మొదట సాయి పల్లవి నటించాల్సింది ఉంది. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె స్థానంలో రాశిఖన్నా నటిస్తోంది. సెకండ్ హీరోయిన్ గా నందితా శ్వేతా నటిస్తోంది.

 
Like us on Facebook