అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ డ్రామా చిత్రం ‘లెనిన్’. ఈ సినిమా నుండి ‘రావణా సందనాలా’ స్పెషల్ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ అందించిన హై-ఎనర్జిటిక్ మాస్ బీట్స్ ఈ ప్రోమోలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం, జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. మాస్ కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా అఖిల్ కెరీర్‌కు మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


