యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన కమర్షియల్ ఎంటర్టైనర్ ‘రభస’. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఆగష్టు 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అన్ని ఏరియాల్లో రభస కోసం థియేటర్స్ లాక్ అయిపోయాయి. ‘రభస’ సినిమా కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాకుండా చెన్నైలో కూడా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఎన్.టి.ఆర్ గత సినిమాల కంటే ‘రభస’ని చెన్నైలో ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 65-70 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఆంధ్ర, తెలంగాణలో లాగా బెనిఫిట్ షోస్ కూడా చెన్నైలో వేయనున్నారు. అన్ని చోట్లా ఇలా బెనిఫిట్ షోస్ ప్లాన్ చెయ్యడం వల్ల సినిమాకి మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.
ఎన్.టి.ఆర్ సరసన సమంత, ప్రణిత జోడీ కట్టిన ఈ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ డైరెక్టర్. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో జయసుధ, బ్రహ్మానందం, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సేనాస్ నుండి ‘ఏ’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


