ఒకరోజు ఆలస్యంగా రానున్న ఎన్.టి.ఆర్ ‘రభస’

Published on Jul 29, 2014 4:59 pm IST

rabasa

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘రభస’ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమా ఆడియోని ఆగష్టు 1న శిల్పకళావేదికలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ ఆడియో విడుదలకి సంబంధించి గ్రాండ్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముందుగా ఈ సినిమాని ఆగష్టు 14న రిలీజ్ చెయ్యాలనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని ఆగష్టు 15న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఎన్.టి.ఆర్ కూడా తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ వర్క్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఎన్.టి.ఆర్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ డైరెక్టర్.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా సమపాళ్ళలో ఉండనున్నాయి. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి బెల్లంకొండ సురేష్ నిర్మాత.

సంబంధిత సమాచారం :