లాక్ చేసిన ఎన్.టి.ఆర్ ‘రభస’ రన్ టైం

లాక్ చేసిన ఎన్.టి.ఆర్ ‘రభస’ రన్ టైం

Published on Aug 21, 2014 11:38 AM IST

Rabhasa

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘రభస’. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగష్టు 29న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ మూవీకి సెన్సార్ నుండి ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఓవరాల్ గా ఈ సినిమాలో 7 యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి అందువలనే ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు.

అలాగే ఈ చిత్ర టీం రభస మూవీ ఫైనల్ రన్ టైం ని లాక్ చేసింది. ఫైనల్ గా ప్రేక్షకులు థియేటర్లో ‘రభస’ చేసే టైం 150 నిమిషాలు(2 గంటల 30 నిమిషాలు). ఎన్.టి.ఆర్ ఎంతో రిస్క్ తీసుకొని చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ రభస’కి హైలైట్ అవుతాయని అంటున్నారు. అలాగే సెకండాఫ్ లో బ్రహ్మానందం – ఎన్.టి.ఆర్ మధ్య వచ్చే కామెడీ ట్రాక్ కూడా ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుందని అంటున్నారు.

ఎన్.టి.ఆర్ నుండి తన అభిమానులు కోరుకునే మాస్ ఎలిమెంట్స్, యాక్షన్, డాన్సులు, కామెడీతో పాటు కుటుంబ విలువలు, సెంటిమెంట్ ఎపిసోడ్ కూడా ఈ సినిమాలో ఉండనున్నాయి. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటించారు. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించాడు.

తాజా వార్తలు