గంధర్వ మహల్ లో సందడి చేస్తున్న ఎన్.టి.ఆర్ – సమంత

Published on Apr 21, 2014 2:57 pm IST

ntr
డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ ఆరోగ్యం బాగా లేనందువల్ల కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ‘రభస'(వర్కింగ్ టైటిల్) షూటింగ్ మళ్ళీ శరవేగంగా జరుగుతోంది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ రోజు ఈ సినిమా షూటింగ్ మణికొండలోని గంధర్వమహాల్లో జరుగుతోంది. ఈ షూటింగ్ లో ఎన్.టి.ఆర్ – సమంత పాల్గొంటున్నారు.

ఎన్.టి.ఆర్ సరసన ప్రణిత సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెకుతున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలతో పాటు కామెడీ కూడా బాగా ఎక్కువగా ఉంటుందని సమాచారం. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :