ప్రభాస్ కి స్పెషల్ థాంక్స్ చెప్తున్న “రాధే శ్యామ్” నటి.!

Published on Jul 2, 2021 8:00 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఒక పాన్ ఇండియన్ స్టార్.. కానీ ఆ ట్యాగ్ సినిమాల వరకు పరిమితమే కానీ తన మనసుకు మాత్రం ఎప్పుడూ అది అంటుకోలేదు.. తాను నార్మల్ సినిమాలు చేసినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా అలానే ఉన్నాడు. ఆ మనస్త్వతమే ప్రభాస్ అభిమానులను మరో మెట్టు ఎక్కేలా చేసింది. అయితే ప్రభాస్ మంచి ఫుడీ..

ఎవరికైనా తినిపించడంలో కానీ తానే స్వయంగా వండి పెట్టడం కానీ ఎంత ఇష్టమో ఎన్నో సార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాగే తన సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ కూడా ఎంతో గౌరవ మర్యాదలను డార్లింగ్ పంచిపెడతాడు. అలాగే ఇప్పుడు తాను చేస్తున్న భారీ చిత్రం “రాధే శ్యామ్” బాలీవుడ్ నటి భాగ్యశ్రీ కి హైదరాబాద్ స్పెషల్ పూతరేకుల రుచి చూపించాడు.

కొన్ని స్వీట్ బాక్సలను ప్రభాస్ ఆమెకి పంపగా వాటిని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసి మరో స్టాక్ స్వీట్ పంపించినందుకు ప్రభాస్ కి స్పెషల్ థాంక్స్ చెబుతూ స్వీట్స్ తినిపించి తనని స్పాయిల్ చేస్తున్నావని క్యూట్ గా చెప్పేసింది. దీనితో ఇవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :