“రాధే శ్యామ్” డిజిటల్ డీల్స్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Jun 26, 2021 11:00 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం పాన్ ఇండియన్ లెవెల్లో మరింత బజ్ పెంచుకుంటుంది. అయితే ఈ చిత్రం నిన్నటి నుంచే బ్యాలన్స్ షూట్ కూడా స్టార్ట్ చేసుకుంది. మరి కొన్నాళ్ల నుంచి ఈ చిత్రంకు సంబంధించి ఓటిటి డీల్స్ నడుస్తున్నాయని బజ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఫైనల్ గా ఈ చిత్రం తాలూకా డిజిటల్ రైట్స్ డీల్స్ కంప్లీట్ అయ్యినట్టు తెలుస్తుంది. ఈ సినిమా హిందీ హక్కులు మినహా మిగతా ముఖ్య భాషల హక్కులు అన్నీ జీ5 వారే కొనుగోలు చేశారట. వీరు ఇంతకు ముందే డైరెక్ట్ స్ట్రీమింగ్ కు భారీ ఆఫర్ ఇచ్చారని కూడా తెలిసింది. ఫైనల్ గా మాత్రం డిజిటల్ రైట్స్ వాళ్ళకే ఇచ్చినట్టు కన్ఫర్మ్ అయ్యిందట. ప్రస్తుతం అయితే ప్రభాస్ ఈ చిత్రం షూట్ కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :